ఫ్యాన్స్​కు పండగే..’అన్​స్టాపబుల్​’ షోకు సూపర్ స్టార్

Superstar for 'Unstoppable' show

0
91

‘అఖండ’ సినిమాతో థియేటర్ల దగ్గర దుమ్ములేపుతున్న బాలయ్య. మరోవైపు ఓటీటీలోనూ తన హవా కొనసాగిస్తున్నారు. ‘అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే’ టాక్​ షోతో అభిమానుల్ని అలరిస్తున్నారు. మొదటి గెస్ట్ గా మంచు కుటుంబం రాగా..సెకండ్ గెస్ట్ గా హీరో నాని వచ్చారు. ఇక ఇటీవలే ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి మూడో ఎపిసోడ్​ లో పాల్గొన్నారు.

ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్ కు సూపర్​స్టార్ మహేశ్​బాబు వచ్చారు. శనివారం షూటింగ్​ జరిగింది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దీంతో అటు బాలయ్య, ఇటు మహేశ్​ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇటీవల ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ టాక్​ షోలో పాల్గొన్న మహేశ్​బాబు.. తనదైన మార్క్ టైమింగ్​తో అలరించారు. ఆ ఎపిసోడ్​ అభిమానులకు కనువిందు చేసింది. ఇలా రోజుల వ్యవధిలో బాబాయ్, అబ్బాయితో కలిసి మహేశ్​ సందడి చేయడం విశేషం.