పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు సర్​ప్రైజ్..డిసెంబర్ 31 రాత్రి పూనకాలే!

Surprise for Pawan Kalyan fans..Punakale on the night of December 31!

0
95

స్టార్​ హీరో పవన్​కల్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. నిత్యామేనన్, సంయుక్త హీరోయిన్లు. తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చింది. కొత్త సంవత్సరం రోజున మరింత జోష్ ఖాయమే అంటుంది చిత్రబృందం ఈ మేరకు డిసెంబర్​ 31న ‘భీమ్లానాయక్​’లోని ‘లాలాభీమ్లా డీజే సాంగ్’​ను విడుదల చేయనున్నారు.

సాయంత్రం 7.02 గంటలకు ‘లాలా.. భీమ్లా డీజే సాంగ్’​ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. అయితే.. తొలుత విడుదలైన సాంగ్​ ఇప్పటికే అభిమానులను అలరిస్తోంది.ఈ చిత్రానికి స్క్రీన్​ప్లే- మాటలు అందిస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకొంది. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది.

సూపర్ హిట్‌ మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్’కు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్‌’ తెరకెక్కుతోంది. పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తుండగా డేనియల్‌ శేఖర్‌గా రానా కనిపించనున్నారు. ఈ మధ్య విడుదల చేసిన వీడియోలో ‘వాడు అరిస్తే భయపడతావా? నేను వాడికన్నా గట్టిగా అరవగలను. అయినా ఎవడు వాడు? పైనుంచి దిగొచ్చాడా?’ అంటూ రానా చెప్పిన డైలాగ్ విశేషంగా అలరిస్తోంది. మధ్యలో పవన్‌ కల్యాణ్‌ దర్శనం ఆ జోష్‌ను మరింత పెంచేలా ఉంది.