Kanguva నిర్మాతకు అండగా సూర్య..

-

భారీ అంచనాలతో విడుదలై చతికిలబడిన సినిమా ‘కంగువ(Kanguva)’. సూర్య నటించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో కలెక్షన్లను కొల్లగొడుతుందని అంతా ఆశించారు. కానీ ఈ సినిమా తీరా విడుదలైన తర్వాత ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. అభిమానులతో పాటు నిర్మాతను కూడా తీవ్ర నిరాశకు లోనుచేసింది.

- Advertisement -

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ నష్టాలను నమదు చేసే దిశగా ప్రయాణిస్తుండటంతో మూవీ నిర్మాత కుంగిపోయాడు. ఈ క్రమంలోనే నిర్మాతకు అండగా నిలవాలని సూర్య(Surya) నిర్ణయించుకున్నాడు. అందుకోసం నిర్మాతకు హామీ కూడా ఇచ్చాడని తమిళ సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. స్టూడియో గ్రీన్ పిక్చర్స్(Studio Green Pictures) బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో ‘కంగువ’ తెరకెక్కింది.

‘కంగువ(Kanguva)’తో నష్టాల పాలైన నిర్మాతుక మరో చిన్న ప్రాజెక్ట్ చేసి పెడతానని సూర్య మాట ఇచ్చాడట. కాగా ఈ ప్రాజెక్ట్‌ను తక్కువ బడ్జెట్‌తో ఆ సినిమాను నిర్మించాలని హీరో ఇప్పటికే సూచించాడట. దాని ద్వారా కంగువా నష్టాలను కొంతమేర పూడ్చుకోవాలని చెప్పినట్లు సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం రెమ్యూనరేషన్‌ను కూడా చాలా తక్కువ మొత్తంలో తీసుకోనున్నట్లు చెప్పాడట సూర్య. ఇప్పుడు సూర్య తీసుకున్న నిర్ణయంపై అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Read Also: సెమీస్‌కు సాత్విక్ జోడీ.. ఓడిన లక్ష్యసేన్
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...