టాప్ 1లో సూర్య ‘జై భీమ్’..హవా కొనసాగిస్తున్న సూర్య

Surya 'Jai Bhim' in the top 1 .. Surya continuing the air

0
107

సూర్య ‘జై భీమ్‌’ సినిమా రికార్డు సృష్టించింది. అమెజాన్‌ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. అందరి దృష్టినీ ఆకర్షించింది. దళిత వర్గానికి చెందిన ఓ కుటుంబంపై పోలీసులు అన్యాయంగా చేసిన దాడిని తెరపై ఆలోజింపజేసేలా చిత్రీకరించారు దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌. ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎండీబీ సినిమాల జాబితాలో టాప్‌-1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ నెల 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా.. 53 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్‌తో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. అటు 97శాతం మంది గూగుల్‌ యూజర్లు ఈ చిత్రం బాగుందంటూ కొనియాడారు. ప్రపంచంలోని వివిధ భాషల్లో వచ్చిన సినిమా రివ్యూ చూసేందుకు గూగుల్‌ చేయగానే మొదట కనిపించే వాటిల్లో ‘ఐఎమ్‌డీబీ’ రేటింగ్‌ ఒకటి. ఇందులోని టాప్‌ రేటెడ్‌ మూవీస్‌కి ఐఎమ్‌డీబీ యూజర్లు రేటింగ్‌ ఇస్తూ ఉంటారు.

నిన్న మొన్నటి వరకూ తొలిస్థానంలో 1994లో విడుదలైన ‘ది షాషాంక్ రిడంప్షన్‌’ ఉండగా..దాన్ని రెండో స్థానానికి నెట్టి ‘జై భీమ్‌’ తొలి స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది ఓటీటీలో విడుదలైన సూర్య చిత్రం ‘ఆకాశం.. నీ హద్దురా’ సైతం ఐఎమ్‌డీబీ టాప్‌-10 జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ‘జై భీమ్‌’తో సూర్య ఆ హవాను కొనసాగిస్తూ తన సత్తా చాటుతున్నాడు.