కివీస్​తో టెస్టులకు జట్టు ప్రకటన..కీ ప్లేయర్స్ కు విశ్రాంతి

Team announcement for Tests with Kiwis..Relax for key players

0
38

న్యూజిలాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది టీమ్ఇండియా సెలెక్షన్ కమిటీ. రెండు టెస్టుల ఈ సిరీస్​లో తొలి మ్యాచ్​కు కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. దీంతో రహానే కెప్టెన్​గా వ్యవహరించనుండగా..పుజారా అతడికి డిప్యూటీగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ సిరీస్​ నుంచి రోహిత్, బుమ్రా, షమీ, పంత్​కు విశ్రాంతినిచ్చారు. రెండో టెస్టుకు కోహ్లీ తిరిగివచ్చి జట్టుకు సారథ్యం వహిస్తాడని బీసీసీఐ తెలిపింది.

టెస్టు జట్టు

రహానే (కెప్టెన్), పుజారా, రాహుల్, మయాంక్ అగర్వాల్, శుభ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సాహా, భరత్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

భారత్-న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ ఇలా..

మొదటి టీ20 – నవంబరు 17, జైపుర్‌

రెండో టీ20 – నవంబరు 19, రాంచి

మూడో టీ20 – నవంబరు 21, కోల్‌కతా

మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్‌

రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబయి