‘తలైవి’ మొదలయ్యేది అప్పుడేనట!

'తలైవి' మొదలయ్యేది అప్పుడేనట!

0
79

మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి దర్శకుడు ఎ.ఎల్. విజయ్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై చాలా కాలమే అయింది. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించాలనీ, తెలుగు .. కన్నడ .. మలయాళ భాషల్లో అనువాదంగా విడుదల చేయాలనే నిర్ణయంతో దర్శక నిర్మాతలు వున్నారు.

జయలలిత పాత్ర కోసం కంగనా రనౌత్ ను తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను గురించి నిర్మాతలలో ఒకరైన శైలేష్ ఆర్ సింగ్ మాట్లాడుతూ .. “ప్రస్తుతం కంగనా తమిళ డిక్షన్ లోను .. క్లాసికల్ డాన్స్ లోనూ శిక్షణ పొందుతోంది. సాంకేతిక నిపుణులు అందరూ ఆన్ బోర్డులోకి వచ్చేశారు. అక్టోబర్ మొదటివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నాము. మైసూరులో షూటింగు మొదలై, చెన్నైలో కంటిన్యూ అవుతుంది” అని చెప్పుకొచ్చాడు.