బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 పూర్తి అయింది, ఇక ఈ ఏడాది సీజన్ 5 స్టార్ట్ కానుంది, ముఖ్యంగా ఓ వార్త వినిపిస్తోంది గత వారం రోజులుగా… ఇప్పటికే సీజన్ 5 కి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయట, ఇక ఇందులో పాల్గొనేవారి తో చర్చలు జరుపుతున్నారు… ఇప్పుడు చర్చలు జరిపి డేట్స్ తీసుకోకపోతే వారికి ఉండే సినిమాలు సీరియల్స్ షోలకి డేట్స్ కష్టం అవుతుంది.. సో ఆరు నెలల ముందు నుంచి ఈ ప్లాన్ జరుగుతుంది.
ఇప్పుడు చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.. ఈసారి జబర్ధస్త్ నుంచి మరొకరికి ఛాన్స్ ఉంది సీరియల్స్ నుంచి ఇద్దరు రానున్నారు, ఇక డ్యాన్స్ షో నుంచి ఒకరు వస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి..
ఇక తాజాగా ఒకరి పేరు వినిపిస్తోంది.. అతనికి ఈసారి ఛాన్స్ ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో, యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న షన్ముఖ్ జస్వంత్ పేరు వినిపిస్తుంది..ఇప్పుడు అతను యూత్ లో మంచి క్రేజ్ ఉన్న పర్సెన్..ఈ వార్తలు అయితే వినిపిస్తున్నాయి బుల్లితెర వర్గాల నుంచి.
షన్ముఖ్ జస్వంత్ సాఫ్ట్వేర్ డెవలపర్ యూట్యూబ్ సిరీస్తో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఇక తెలుగులో పలు వెబ్ సిరీస్ లు చేశాడు..షన్ముఖ్కు 26 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్లో అయితే 10 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు ముఖ్యంగా సోషల్ మీడియా స్టార్ అనే చెప్పాలి, అందుకే అతనిని తీసుకురావాలి అని చూస్తున్నారట.