మళ్ళీ హారర్ కామెడీ లో నటించనున్న తమన్నా..!!

మళ్ళీ హారర్ కామెడీ లో నటించనున్న తమన్నా..!!

0
94

తెలుగు .. తమిళ .. భాషల్లో కథానాయికగా తమన్నా గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఇంత పోటీలోనూ ఒక్కో అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూనే వుంది. ఇటీవల హారర్ కామెడీ సినిమాలను సైతం చేస్తూ వస్తోన్న తమన్నా, తమిళంలో మరో హారర్ కామెడీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఆ మధ్య తెలుగులో ‘ఆనందో బ్రహ్మ’ అనే హారర్ కామెడీ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ ప్రధానమైన పాత్రను పోషించింది. ఇప్పుడు ఇదే సినిమాను తమిళంలో రీమేక్ చేస్తుండగా .. తాప్సీ పాత్రలో తమన్నా కనిపించనుంది. రోహిన్ వెంకటేశన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. తెలుగులో హిట్ అయిన ఈ హారర్ కామెడీ, తమిళంలో తమన్నాకి హిట్ ఇస్తుందేమో చూడాలి.