Tamanna | విజయ్‌ను ప్రేమించడానికి బలమైన కారణం ఇదే: తమన్నా

-

సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamanna) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ అగ్ర హీరోల సరసన నటించి సత్తా చాటింది. దాదాపు 17 ఏళ్లుగా అగ్రకథానాయికగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పుడు సినిమాలతోనే కాకుండా.. అటు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది మిల్కీబ్యూటీ. అయితే ఇటీవల పలు వెబ్ సిరీస్‏లలో రొమాంటిక్ సీన్స్ చేసింది తమన్నా. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా రొమాంటిక్ సీన్స్ చేయడంతో ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)ను ప్రేమించడం గురించి చెప్పుకొచ్చింది. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇక ఆ రూమర్స్ నిజమేనంటూ మిల్కీబ్యూటీ చెప్పుకొచ్చింది. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ సమయంలోనే విజయ్‌తో ప్రేమలో పడ్డానని తెలిపింది. విజయ్ వర్మ నా జీవితంలోకి వచ్చినందకు చాలా ఆనందంగా ఉంది. అతను మహిళలను గౌరవిస్తారు. ముఖ్యంగా నా అభిప్రాయాలకు గౌరవం ఇస్తాడు. అందుకే నేను అతడిని ప్రేమించాను. తనకు కుటుంబం అంటే చాలా ఇష్టం. ఇంట్లో వారితో ఎలా ఉంటారో బయటివారితో అలాగే ఉంటారు. ఇతరులను గౌరవించడం ప్రస్తుతం యువత నేర్చుకోవాలి. ఇతరులతో ఎలా ఉండాలో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. మహిళలు ప్రతి విషయంలో రాజీ పడాలనే భావనను నేను అంగీకరించను అని అన్నారు తమన్నా(Tamanna). ప్రస్తుతం మిల్కీబ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Read Also:
1. నందమూరి కల్యాణ్ రామ్ కొత్త సినిమా అప్‌డేట్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...