పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన వనిత్ విజయ్ కుమార్

Tamil Actress Vanith Vijay Kumar gave clarity about marriage

0
35

తమిళ నటి వనిత విజయ్ కుమార్ తెలియని వారు ఉండరు. 2020లో ఆమె పీటర్ పాల్ ని వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. అది ఆమెకి మూడో వివాహం. అయితే కొన్ని నెలలకు ఇద్దరికి వివాదాలు రావడంతో విడిపోయారు. ఇక తాజాగా వనితకు సంబంధించిన ఫోటో ఇటీవల వైరల్ అయింది. దీంతో ఆమె నాల్గో వివాహం చేసుకుంది అని అందరూ భావించారు.

వనిత తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్ తో కలిసి ఈ ఫోటోలో ఉంది. ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో దండలు మార్చుకుంటున్నట్టుగా ఉంది. ఇక అందరూ పెళ్లి అని అనుకున్నారు. కాని దీనిపై వనిత స్పందించారు అది రియల్ మ్యారేజి కాదని, ఓ సినిమాకు సంబంధించిన స్టిల్ అని స్పష్టత ఇచ్చింది.

మగాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా తప్పుపట్టని ఈ జనాలు, అదే ఓ మహిళ చేస్తే ఎందుకు తప్పు పడతారు అని ప్రశ్నించింది. నాలుగు కాదు నలబై పెళ్లిళ్లు చేసుకుంటా పెళ్లి నా వ్యక్తిగత విషయం అని తెలిపింది. ఇక ఇప్పట్లో మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని వనిత స్పష్టం చేసింది.