తమిళ హీరో విజయ్ కు ఐటీ షాక్ ఎంత ఫైన్ అంటే

తమిళ హీరో విజయ్ కు ఐటీ షాక్ ఎంత ఫైన్ అంటే

0
86

తమిళ హీరో విజయ్ అంటే తెలియని వారు ఉండరు… తన సినిమాల జోరు కొనసాగిస్తున్నారు.. సౌత్ ఇండియాలో కూడా తన జోరు చూపిస్తున్నారు ఆయన, ఇక ఇటీవల విజిల్ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది, తమిళ్ లో బిగిలిగా ఈచిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

తాజాగా హీరో విజయ్ కు ఐటీ శాఖ నుంచి షాక్ తగిలింది. విజయ్ హీరోగా ఆయన సొంత నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్ టైన్ మెయింట్ గత ఏడాది బిగిలిచిత్రాన్ని నిర్మించింది, అయితే ఈ సూపర్ హిట్ సినిమాకి ఆదాయపు పన్నువివరాలు సరిగ్గా సమర్పించలేదట.

అందుకే ఆయన ఇళ్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు..రూ.24 కోట్ల నగదు, భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణకు రావాలని ఏజీఎస్ గ్రూపుకు ఐటీ శాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే దాదాపు దీనిపై 10 కోట్ల మేర పన్ను కట్టే అవకాశం ఉంది అని కోలీవుడ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.