మెగాస్టార్‌ సినిమాలో విలన్ గా త‌మిళ స్టార్ హీరో..

0
113

ప్రస్తుతం స్టార్ హీరో చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మంచి కధ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. పెద్ద హీరోయిన్ల్ నుండి ముద్దుగుమ్మల వరకు అందరితో నటించిన ఘనత సాధించాడు. ఇటీవలే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ చిత్రం ఆచార్య అనుకున్న మేరకు కలెక్షన్స్ సాదించలేకపోయిన హీరోస్ మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అయితే ఆ తరువాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో చిరు రెండు సినిమాలకు ఒకే చెప్పి మెగా అభిమానులను అబ్బురపరిచారు. అందులో మొదటిది బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా. అయితే ఈ సినిమాకు వాల్తేరు వీర‌య్య అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు బాబీ అధికారికంగా ప్ర‌క‌టించాడు.

ప్రస్తుతం ఈ సినిమాలో విలన్ పాత్రకు ఓ స్టార్ హరోను ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో విల‌న్‌గా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌నున్న‌ట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. విజ‌య్ సేతుప‌తిని కూడా కథ నచ్చి ఈ సినిమాలో నటించడానికి ఒకే చెప్పినట్టు సమాచారం తెలుస్తుంది.