తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్ – బీస్ట్

Tamil Star Hero Dalapati Vijay - Beast

0
102

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ పుట్టిన రోజు నేడు. ఇక ఆయ‌న అభిమానులు ఎంతో పండుగ చేసుకుంటున్నారు. మ‌రికొత్త సినిమా గురించి, అలాగే ప్ర‌స్తుత సినిమా గురించి ఏదైనా అప్ డేట్ వ‌స్తుందా అని అభిమానులు వేయిక‌ళ్ల‌తో ఎదురుచూశారు. అయితే తాజాగా ఆ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది.

డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌తో చేస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఇక ఆయ‌న అభిమానులు ఈ ఫ‌స్ట్ లుక్ టైటిల్ ని సోష‌ల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. త‌మ‌కు ఎంతో బాగా న‌చ్చింద‌ని టైటిల్ గురించి చెబుతున్నారు.

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ 65వ చిత్రానికి బీస్ట్ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. తెలుగులోనూ ఇదే టైటిల్‌తో రానున్నట్లు సమాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రానుంది. ఇక ఈ చిత్రంలో విజ‌య్ లుక్ చాలా అద్భుతంగా ఉంది.