యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు. ఇక ఇందులో కొమురం భీమ్ గా కనిపించనున్నాడు యంగ్ టైగర్. ఇక మరో నెల రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వనుంది. దీని తర్వాత ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఈ షో స్టార్ట్ చేస్తారు అని తెలుస్తోంది. ఇక తన తదుపరి ప్రాజెక్టులపై ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన.
ఇక నందమూరి అభిమానులు కూడా ఆయన సినిమాల గురించి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని చూస్తున్నారు. కరోనా కారణంగా ఇటు సినిమా షూటింగులు ఆగిపోయాయి. అటు టీవీ కార్యక్రమం ఆడిషన్స్ ఆలస్యమయ్యాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ అలాగే ఈ టీవీ షోకి సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. ఈ రెండు పనులు పూర్తి అయ్యాక ఆయన కొరటాల సినిమాకు సిద్దం అవుతారట.
వచ్చేనెలలో ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకుని అక్కడ నుంచి బయటికి వచ్చేస్తే, ఆ వెంటనే టీవీ షోకి వెళ్లిపోవచ్చని భావిస్తున్నాడట తారక్ . ఇక ఆగస్టు నుంచి కొరటాల సినిమా సెట్స్ పైకి రానుంది.