Alekhya Reddy |రెండో పెళ్లి వార్తలపై తారకరత్న భార్య అలేఖ్య క్లారిటీ

-

హీరో నందమూరి తారకరత్న మన మధ్య నుంచి వెళ్లిపోయి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. ఆయన మరణవార్తను ఇప్పటికీ భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన బాధను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆమె రెండో పెళ్లి ఆలోచనలో ఉందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలపై అలేఖ్య పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. తారకరత్నతో ఉన్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆమె ఎమోషనల్ అయింది. ‘ఈ జీవితానికి నువ్వు .. నేను మాత్రమే.. నాకు జీవితానికి సరిపడా జ్ఞాపకాలు ఇచ్చి వెళ్లావు. వాటితోనే జీవితాంతం బతుకుతా.. నా చివరి శ్వాస వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ తెలిపింది. దీంతో ఆమె(Alekhya Reddy)కు రెండో పెళ్లి లాంటి ఆలోచనలు ఏమీ లేవని అర్థమవుతోంది. కాగా ఈ ఏడాది జనవరిలో గుండెపోటుకు గురైన తారకరత్న(Taraka Ratna) 23 రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాడుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

- Advertisement -
Read Also: ఆకట్టుకుంటున్న ‘ఖుషీ’ మూవీ ఫస్ట్ సాంగ్ ప్రోమో

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...