మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టు నోటీసులు

0
megastar chiranjeevi

Megastar Chiranjeevi |మెగాస్టార్‌ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలో ఇటీవల చిరంజీవి కొనుగోలు చేసిన స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేయవద్దంటూ నోటీసులు జారీ చేసింది. వివాదాస్పదమైన ఆ స్థలం యథాతథంగా కొనసాగాలని జూబ్లీహిల్స్ సొసైటీకి, చిరంజీవికి హైకోర్టు ఆదేశించింది. ప్రజల ఉపయోగం కోసం ఉద్దేశించిన 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ చిరంజీవికి విక్రయించిందంటూ జె.శ్రీకాంత్ బాబు, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మార్చి 14న హైకోర్టులో విచారణ జరిగింది.

Read Also: ఎన్టీఆర్‌కు సరైన విలన్‌ను సెట్ చేసిన కొరటాల శివ

Follow us on: Google News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here