టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత ఇటీవల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో సామ్‌పై పలు పుకార్లు వచ్చాయి. ‘సమంత పిల్లలను వద్దనుకుంది.. అబార్షన్ కూడా చేయించుకుంది’ ఆ రూమర్స్‌లో ఒకటి.
దీనిపై నిర్మాత నీలిమ గుణ ఓ షాకింగ్ విషయాన్ని తెలిపారు. సామ్ పిల్లల్ని కనేందుకు అంతా సిద్ధం చేసుకుందని, కానీ రెండు నెలల్లోనే ఏదో జరిగి ఉంటుందని చెప్పారు.శాకుంతలం సినిమా కోసం మా నాన్న (దర్శకుడు గుణశేఖర్) సమంతను సంప్రదించారు. అయితే అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుంది. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నట్లు చెప్పింది.
కానీ శాకుంతలం కథ నచ్చడం వల్ల కొన్ని షరతులు విధించి ఒప్పుకొంది. జులై, ఆగస్టు నాటికి చిత్రీకరణ పూర్తిచేయాలని కోరింది. మేము దానికి అంగీకరించాం. ఈ చిత్రం తర్వాత విరామం తీసుకుని, తల్లి కావాలని ఆమె కోరుకుంది. తన ప్రాధాన్యత అదేనని చెప్పింది. కానీ ఇప్పుడు చైతూ-సామ్ విడిపోవడం షాకింగ్‌గా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.