ఆ అగ్ర దర్శకుడు నన్ను ఇబ్బంది పెట్టాడు – హీరోయిన్ సంచలన కామెంట్స్

That top director bothered me- Heroine sensational comments

0
108

క్యాస్టింగ్ కౌచ్ అంశం దేశంలో పెద్ద దుమారం రేపింది. పైకి ఉత్తములుగా కనిపించినా వారు ఎలాంటి వారో కొందరు హీరోయిన్లు వారి బండారాన్ని బయటపెట్టారు. అవకాశాలు కావాలంటే పడకసుఖం ఇవ్వాల్సిందే అని కొందరు డిమాండ్ చేశారు.ఇలా వారి అసలు రూపాన్ని బయటపెట్టారు. అయితే ఇప్పటికీ ఎక్కడో ఓ చోట ఇలాంటి వారి బండారం బయటపడుతూనే ఉంది.

సౌత్ ఇండియా సినీ పరిశ్రమకు చెందిన ఓ అగ్ర దర్శకుడు తనను ఇబ్బంది పెట్టాడని బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ఆరోపించారు.ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. సౌత్ ఇండియాలో ఆ అగ్ర దర్శకుడి సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. అక్కడికి ఆడిషన్స్ కు వెళ్లాను. రోజంతా అక్కడ ఉన్నాను, ఇక నాకు అనారోగ్యంగా ఉండటంతో ముంబై వచ్చాను, తర్వాత ఫోన్ చేశాడు.

మీకు ఆరోగ్యం బాలేదు కదా నన్ను ముంబై రమ్మంటారా అని అడిగాడు, తర్వాత పదే పదే ఫోన్ చేశాడు. ఆ డైరెక్టర్ వాళ్ల స్నేహితుడితో కాల్ చేయించాడు. ఈ సినిమా తెరకెక్కించడానికి చాలా సమయం పడుతుంది. డైరెక్టర్ గారు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అని అడిగాడు. వారి భావం నాకు అర్దమైంది. నేను ఫైనల్ గా చెప్పా? నా టాలెంట్ నచ్చితే అవకాశం ఇవ్వండి లేకపోతే అవసరం లేదని. మొత్తానికి ఆ దర్శకుడు ఎవరా అని సౌత్ ఇండియాలో సినిమా అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు.తెలుగులో రాజు మాహారాజు సినిమాలో ఆమె నటించింది.