తెలంగాణలో ఇంకా తగ్గిన కరోనా కేసులు, బులిటెన్ రిలీజ్ : జిల్లాల లిస్ట్ ఇదే

Telangana Corona Cases Bulletin Released

0
34

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే శుక్రవారం కొద్దిగా తగ్గింది. ఇవాళ వెల్లడైన కరోనా బులిటెన్ లో 1061 కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క జిహెచ్ఎంసి లో మాత్రమే త్రిబుల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. ఇక సింగిల్ డిజిట్ కేసులు నమోదైన జిల్లాలు ఏడు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాల్లో డబుల్ డిజిట్ కేసులు వచ్చాయి.

గురువారం నమోదైన 1088 కేసులు, బుధవారం నమోదైన 1114 కేసులు, మంగళవారం కేసులు 1175 కంటే ఇవాళ కేసుల నమోదులో తగ్గుదల కనబడుతున్నది. 88 పోలిస్తే మరింతగా తగ్గాయి.
ఇవాళ మరణాల సంఖ్య 11 గా నమోదైంది. గురువారం మరణాల సంఖ్య 9 కాగా, బుధవారం 12 మంది మరణించారు. మంగళవారం మరణాల సంఖ్య 10 ఉంది. మరణాల సంఖ్య గడిచిన వారం రోజులుగా పదికి అటూ ఇటుగా నమోదవుతున్నది.

జిల్లాల వారీగా చూస్తే జిహెచ్ఎంసిలో మాత్రమే 135 కేసులతో త్రిబుల్ డిజిట్ నమోదైంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సైతం పరిస్థితి ఆశాజనకంగా మారి డబుల్ డిజిట్ కు కేసులు చేరుకున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు 120397 జరిపారు. కోవిడ్ సోకి ఇవాళ కోలుకున్న వారి సంఖ్య 1556 గా ఉంది. రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 15524 మాత్రమే ఉన్నాయి. వెయిటింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 736.

నేడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 3
కొత్తగూడెం 47
జిహెచ్ఎంసి 135
జగిత్యాల 20
జనగామ 11
జయశంకర్ భూపాలపల్లి 21
జోగులాంబ గద్వాల 5
కామారెడ్డి 3
కరీంనగర్ 80
ఖమ్మం 52
కొమరం భీం ఆసిఫాబాద్ 6
మహబూబ్ నగర్ 23
మహబూబాబాద్ 44
మంచిర్యాల 51
మెదక్ 6
మేడ్చల్ మల్కాజ్ గిరి 47
ములుగు 22
నాగర్ కర్నూల్ 12
నల్లగొండ 65
నారాయణపేట 8
నిర్మల్ 3
నిజామాబాద్ 10
పెద్లపల్లి 53
రాజన్న సిరిసిల్ల 19
రంగారెడ్డి 66
సంగారెడ్డి 14
సిద్దిపేట 50
సూర్యాపేట 67
వికారాబాద్ 12
వనపర్తి 16
వరంగల్ రూరల్ 17
వరంగల్ అర్బన్ 46
యాదాద్రి భువనగిరి 27