జాతి రత్నాలు సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది, ఇక ఈ సినిమా చూసి వచ్చిన ప్రతీ ఒక్కరు సూపర్ అంటున్నారు, అందరి నటన బాగుంది కథ మాటలు పంచ్ లు అదరహో అంటున్నారు, ఇక చిట్టీ అనే పాట సినిమాకు ఎంతో హైలెట్ గా నిలిచింది. ఎక్కడ చూసినా హీరొ మాటలు కామెడీతో సందడి చేస్తున్నారు.
ఈ లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి, క్రాక్ ఉప్పెన జాతిరత్నాలు ఇలా వరుసగా సూపర్ హిట్ అవుతున్నాయి సినిమాలు… అయితే ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి… బయ్యర్లకు మాత్రం నిజంగా ఇది పండుగ అనే చెప్పాలి..అందరూ చాలా హ్యాపీలో ఉన్నారు.
కేవలం మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టించారు జాతి రత్నాలు. ఇక గురువారంతో ఫస్ట్ వీక్ పూర్తి అయింది, మొత్తం ఈ సినిమా వసూళ్లు చూసుకుంటే 23.09 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. కర్ణాటక, మిగిలిన స్టేట్స్ లో . 1.18 కోట్లు వసూళు చేసింది.
విదేశాల్లో సరికొత్త రికార్డు ఏకంగా3.43 కోట్లను రాబట్టింది. మొత్తంగా ఫస్ట్ వీక్ రూ. 27.70 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి.. మొత్తం గ్రాస్ చూస్తే రూ. 46 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక సినిమా బాగా నచ్చడంతో రెండు మూడు సార్లు వెళుతున్నారు యూత్.