మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు ..ముఖ్యంగా ఆయనతో సినిమా అంటే దర్శక నిర్మాతలకు పండుగ ..ఇక చిన్న రోల్ ఇచ్చినా చేయడానికి రెడీ అంటారు నటులు, ఇక ఆయనతో సినిమా అంటే ఎవరైనా సరే రెమ్యునరేషన్ గురించి కూడా పెద్ద పట్టించుకోరు ..బాస్ పక్కన తెరపై కనిపించాలి అని కోరుకుంటారు, ఇక టెక్నిషియన్ కి బాస్ తో సినిమా అంటే కల.
ఇక మెగాస్టార్ తో కలిసి వర్క్ చేయాలి అని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడు, మొత్తానికి తమన్ కోరిక నెరవేరింది.మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు సంగీతం అందించే అవకాశం దక్కించుకొని తన ఆనందాన్ని ట్వీట్ రూపంలో తెలిపారు..చిరంజీవి హీరోగా మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ తెలుగులో రీమేక్ రాబోతుంది.
ఈ సినిమాకి మోహన్ రాజా డైరెక్షన్ చేస్తున్నారు .శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ సినిమాని, ఇక ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించనున్నారు. ఆచార్య తర్వాత లూసిఫర్ సెట్ పై తీసుకువెళ్లనున్నారు.