గుమ్మడికాయ కొట్టేసిన ‘గని’ టీం

The ‘mine’ team that hit the pumpkin

0
110

మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో ‘గని’ సినిమా రూపొందింది. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మిస్తున్న ఈ సినిమాకి, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుని వచ్చాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మడికాయ కొట్టేశారట.

ఈ సినిమాతో సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. ఇక జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీంచంద్ర ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.