“రామారావు ఆన్ డ్యూటీ” నుంచి టైటిల్ సాంగ్ వచ్చేసింది- వీడియో

0
36

మాస్ మహారాజ్ రవితేజ దూకుడు పెంచారు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే క్రాక్ తో హిట్ కొట్టిన హీరో ఖిలాడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇక తాజాగా రవితేజ నటిస్తున్న మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’

శరత్ మండవ దర్శకుడు కాగా దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొంతకాలం క్రితం హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఈ సినిమాలో కీ రోల్ పోషించనున్నారు.  ఈ సినిమా జూలై 29న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. దీంతో మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సాంగ్ ఊర మాస్ గా ఉందంటూ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

మీరు కూడా ఈ సాంగ్ చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/6D82BbYOKEc