“సర్కారు వారి పాట” ట్రైలర్‌ రిలీజ్..ఫుల్ జోష్ లో ఫాన్స్..

0
108

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం లో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. మహేష్‌ బాబు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమాకు నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కళావతి సాంగ్, టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసి అభిమానులను ఈలలు వేసేలా చేసింది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

నేడు సర్కార్ వారి పాట ట్రైలర్  రిలీజ్ చేసి  మహేష్ అభిమానులకు ఆనందపరిచింది. ఈ ట్రైలర్ లో మహేష్ బాబు ఫుల్ మాస్ హీరోగా కనిపించాడు. ఫైట్ తో అదరగొట్టి అందరిని ఫిదా చేసాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ తో  లవ్ యాంగిల్ కూడా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మే 12న విడుదలై థియేటర్లలో సందడి చేయనుంది.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/tVr9v3o7iHY