బాలకృష్ణ , బోయపాటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ మూవీపై రిలీజ్ కు ముందు నుంచే క్రేజ్ ఏర్పడింది. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లయన్ సినిమాలు బిగ్ హిట్ కావడంతో అఖండపై భారీ అంచానాలు ఏర్పడ్డాయి.
అందుకు తగ్గట్లుగానే అఖండ విజయపథంలో దూసుకుపోతోంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృస్టిస్తోంది. అఖండ మూవీకి థమన్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో ఈ మూవీ దూసుకుపోతోంది.
అలాగే 2021 సంవత్సరంలో హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. మొదటి వారంలో ఈ సినిమా ఏకంగా 10.08 కోట్లు వసూలు చేసి సత్తా చాటుతుంది. ఆస్ట్రేలియా, యూరప్, సింగపూర్, కెనడాలో కలెక్షన్ల సునామి కొనసాగుతుంది.