కత్తి మహేష్ చివరి పోస్టులు ఇవే

These are the last posts of Kathi Mahesh

0
112

సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. ప్రముఖ నటుడు సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కోలుకుంటున్నారని ఆయన డిశ్చార్జ్ అవుతారని అందరు అనుకుంటున్న సమయంలో ఆయన మరణం అందరిని ఒక్కసారిగా విషాదంలోకి నెట్టింది. కత్తి మహేశ్ లో నటుడు, విమర్శకుడే కాదు మంచి సాహితీ అభిమాని కూడా ఉన్నాడు.

చాలా పుస్తకాలు చదువుతూ ఉండేవారు అనేక పుస్తక సమీక్షలు చేస్తూ ఉంటారు.సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు చెప్పేవారు, రోడ్డు ప్రమాదానికి ముందు కూడా ఆయన రెండు పుస్తకాల గురించి ఫేస్ బుక్ లో ప్రస్తావించారు. ఈ పుస్తకాలు చదవాలి అని నెటిజన్లకు చెప్పారు. ఆర్ట్స్ పై తనకున్న మక్కువను తెలుపుతూ కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు.

మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల కంటే కూడా తెలుగును ఎక్కువగా చదివేవాడినంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఇక ఆయన పాత పోస్టులు అన్నీ కూడా ఆయన అభిమానులు చూస్తున్నారు. సినిమా సమీక్షలతో పాటు పుస్తకాలపై సమీక్షలు చేసేవారు.మా ఎన్నికలపైనా తన స్పందన తెలియజేశారు.