లతా మంగేష్కర్ పాడిన తెలుగు పాటలు ఇవే..

0
104

దిగ్గజ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ మృతి యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు అన్ని భారతీయ భాషల్లో వేల సంఖ్యలో గీతాలను ఆలపించిన ఆమె, తెలుగులో మాత్రం చాలా తక్కువ పాటలు పాడారు.

1955లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన ‘సంతానం’ చిత్రంలో ఆమె తొలిసారి తెలుగు పాటను పాడారు.

1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించగా ఇళయరాజా సంగీతమందించిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్లచీరకు’ పాటను గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు. ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌.

1995లో ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’. ఇందులో ఆమె పాడిన ‘తుఝే దేఖాతోయే జానా సనమ్’ భాషతో సంబంధం లేకుండా సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది.