సిరివెన్నెల చివరి పాట ఇదేనట (వీడియో)

This is the last song of Sirivenne

0
74

నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘సిరివెన్నెల’ అనే పాటను, ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నారు.

అందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వీడియోను కొంతసేపటిక్రితం రిలీజ్ చేశారు. హీరో నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఈ వీడియోలో మాట్లాడారు. ఇది సిరివెన్నెల రాసిన చివరి పాట అని చెప్పారు. నవంబర్ 4వ తేదీన ఆయన ఈ పాటను రాశారని అన్నారు. ఈ పాటలో సిరివెన్నెల అంటూ ఆయన పేరు వస్తుంది.

ఆ విషయాన్ని గురించి రాహుల్ సాంకృత్యన్ ని అడిగితే, అదే తన చివరి పాట కావొచ్చని సిరివెన్నెల అన్నారట. ‘నెల రాజునీ..ఇలా రాణిని కలిపింది కదా సిరివెన్నెల’ అంటూ ఈ పాట సాగుతోంది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. 7వ తేదీన పూర్తి పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?time_continue=4&v=HAKvVYBspl8&feature=emb_title