ఆ డైరెక్టర్ తో సూపర్ స్టార్ స్టార్ మహేష్ నెక్స్ట్ మూవీ..

0
113

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆరడుగుల అందగాడిగా చిత్రసీమలో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. తాజాగా స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో మహేష్‌ బాబు చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది.

ఈ సినిమా మే 12న విడుదలై థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో పాటు మహేష్ తర్వాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని కూడా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్ తన నెక్స్ట్ సినిమాపై అనౌన్స్ మెంట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేసాడు.

ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అతడు, ఖలేజా’ వంటి సినిమాలు తీసి రికార్డ్స్ క్రీయేట్ చేసిన మహేష్ ప్రస్తుతం SSMB28 పిక్చర్ ను తెరెక్కించడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. కానీ షూట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయమై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఏడాది జూన్ లో సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.