థామస్ అల్వా ఎడిసన్ చేసిన పనికి హాలీవుడ్ షేక్ అయింది ఏం చేశారంటే

థామస్ అల్వా ఎడిసన్ చేసిన పనికి హాలీవుడ్ షేక్ అయింది ఏం చేశారంటే

0
79

థామస్ అల్వా ఎడిసన్.. ప్రపంచానికి పెద్దగా పరిచయం చేయనక్కర్లేని వ్యక్తి, ఆయన బల్బు కనిపెట్టడమే కాదు వెయ్యికిపై కొత్త ఆవిష్కరణలు తయారు చేసి ఏడాదికి 50 వరకూ తయారు చేసి అన్నీంటికి తనపై పేటెంట్ హక్కులు పొందారు.. సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఎన్నో ఆయన తయారు చేశారు.
టాకింగ్ మోషన్ పిక్చర్ తీసే కెనెటోస్కోప్ మొదలు థియేటర్లో తెరపై సినిమా వేసే ప్రొజెక్టర్ వరకు అనేక వాటిలో ఆయన కనిపెట్టిన పరికరాలకు పేటెంట్ హక్కులు పొందారు.

దీంతో ఆయన ఎవరైనా తానుకనిపెట్టిన వాటితో సినిమా తీస్తే నగదు చెల్లించాలి అని కేసులు వేసేవారు, దీని కోసం ఆయన 1908లో మోషన్ పిక్చర్ పెటెంట్స్ కంపెనీ ఎంపీపీసీని స్థాపించారు. అందులో ఉద్యోగులు సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఈ వస్తువులు వాడుతున్నారా అనేది చూసేవారు.

దీంతో వారికి రాయల్టీ చెల్లించేవారు, అయితే ఇది తట్టుకోలేని చిత్ర నిర్మాణ సంస్ధలు..సినీ పరిశ్రమను మొత్తం యూఎస్లోనే న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల నుంచి ఏకంగా హలీవుడ్ కు మార్చేసాయి, అంటే ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి, అది కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజిల్స్లోని ఉంది, దీంతో తర్వాత ఆయన కేసులు వేసుకున్నా అవి చెల్లేవి కావు, అక్కడ కోర్టులు వీటిని స్వీకరించేవి కావు, అలా చిత్ర పరిశ్రమ ఎడిసన్ నుంచి ఆనాడుతప్పించుకుందట..నెస్టర్ స్టూడియో హాలీవుడ్లో తొలి స్టూడియోగా ఏర్పాటు అయింది.