Tillu Square Trailer | యూట్యూబ్‌లో అదరగొడుతోన్న ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ 

-

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్(Tillu Square Trailer) యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఇప్పటివరు ఈ చిత్రానికి 4 మిలియన్ల వ్యూస్ వచ్యాయి. ఇక ట్రైలర్‌లో అనుపమతో సిద్ధు ఘాటైన ముద్దులు కుర్రకారును ఊపేస్తున్నాయి. తొలిసారిగా అనుపమ గ్లామర్ రోల్‌లో చేయడం విశేషం. రొమాంటిక్ పాత్రల్లో ఇద్దరి జోడి అలరించింది. ఇక టిల్లుగా మరోసారి సిద్ధు అదరగొట్టాడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడిగా పనిచేశాడు.

- Advertisement -

ఇక ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘టిల్లు స్క్వేర్’(Tillu Square Trailer) సినిమా మార్చి 29న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాకు రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నాడు. కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్’ చిత్రంలోనూ, నీరజ కొన డైరెక్షన్‌లో ‘తెలుసు కదా’ అంటూ మరో చిత్రంలోనూ సిద్ధు హీరోగా నటిస్తున్నాడు.

Read Also: ఈ ఫ్రూట్స్ తింటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం బూస్ట్ అవుతుంది
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...