నిర్మాతగా మారుతున్న టాలీవుడ్ అందాల హీరోయిన్

-

హీరోయిన్స్ సినిమాల్లో నటిస్తారు అనే విషయం తెలిసిందే.. పలు షోలు చేస్తూ ఉంటారు అయితే చిత్ర సీమలో దర్శకత్వానికి వచ్చేవారు చాలా తక్కువ.. ఇటీవల పలు రకాల వ్యాపారాలు కూడా ప్రారంభించిన నటీమణులు ఉన్నారు, అయితే తాజాగా ఇప్పుడు నిర్మాణంలోకి కూడా అడుగు పెట్టింది ఓ అందాల తార, మరి ఎవరు ఆమె అనేది చూద్దాం.

- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్ మమత మోహన్ దాస్ రిస్క్ చేస్తూ నిర్మాతగా మారింది.గాయనిగా పరిచయమై తక్కువ కాలంలో ఆమె తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, కథానాయకుడు, చింతకాయల రవి, కింగ్.. వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది, అంతేకాదు మెప్పించింది ఆమె నటనతో.

అయితే, కెరీర్ బాగుండగానే కేన్సర్ సోకడంతో పెద్ద పోరాటమే చేసింది. చివరికి కేన్సర్ ని జయించి మళ్లీ ఇప్పుడు సినిమా రంగంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ భామ నిర్మాతగా మారింది, తాజాగా ఆమె మలయాళ సినిమా నిర్మిస్తోంది.
మమతా మోహన్ దాస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తానని తెలిపింది ఆమె.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gujarat | శివాలయంలోని శివలింగం చోరీ..

Gujarat |‘గుడిని.. గుల్లోని లింగాన్ని మింగేసే రకం’ అంటూ స్వార్థం కోసం...

East Godavari | మహాశివరాత్రి వేళ తాడిపూడిలో విషాదం..

గోదావరిలోకి దిగి ఐదుగురు మృతిచెందిన ఘటన తూర్పు గోదావరి(East Godavari) జిల్లా...