చంద్రమోహన్ మరణంపై సినీ ప్రముఖుల సంతాపం

-

సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ (Chandra Mohan) మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

- Advertisement -

‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్యమైన నటనా కౌశలం ద్వారా తెలుగువారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్‌ నటులు, కథానాయకుడు చంద్రమోహన్‌ గారు ఇక లేరని తెలియడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’లో మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’-చిరంజీవి(Chiranjeevi)

“పౌరాణిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, తన హాస్యానటనతో తెలుగు ప్రేక్షకులను చంద్రమోహన్ గారు ఆకట్టుకున్నారు. నాన్నగారితో కలిసి యుగపురుషుడు, నిండుదంపతులు, తదితర చిత్రాల్లో నటించారు. నాతో కలిసి ఆదిత్య 369 సినిమాలో తెనాలి రామకృష్ణ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. చంద్రమోహన్ ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”- బాలకృష్ణ(Balakrishna)

“చంద్రమోహన్‌(Chandra Mohan)గారి మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను”- వెంకటేష్(Venkatesh)

“ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం.వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను”- జూ.ఎన్టీఆర్(Jr.NTR)

“పదహారేళ్ళ వయసు నుంచి మా స్నేహం మొదలైంది. నాకు మంచి మిత్రుడు, మంచి మనిషి అయినా చంద్ర మోహన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూత” -కె రాఘవేంద్ర రావు(Raghavendra Rao)

‘‘విలక్షణ నటుడు చంద్రమోహన్‌ అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు చిత్రాల్లో నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’- కల్యాణ్‌ రామ్‌(Kalyan Ram)

‘‘ఆయన మోము మనకు అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ఆయన చిరస్మరణీయమైన నటన, అద్భుతమైన పాత్రలతో ప్రతిసారీ మన పెదవులపై చిరునవ్వు విరుస్తుంది’’- సాయి ధరమ్‌ తేజ్‌(Sai Dharam Tej)

Read Also: చంద్రమోహన్ మృతిపై సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో కొత్త హామీలు ఇవే..

వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌...

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...