టాలీవుడ్ డైరెక్టర్ సుజీత్ వివాహం అమ్మాయి ఎవరంటే ?

టాలీవుడ్ డైరెక్టర్ సుజీత్ వివాహం అమ్మాయి ఎవరంటే ?

0
90

ఈ లాక్ డౌన్ వేళ చాలా మంది వివాహాలు కొద్ది రోజులు వాయిదా వేసుకున్నారు, మరికొంత మంది తక్కువ మందితోనే వివాహాలు జరిపించారు, కేవలం కుటుంబ సభ్యుల మధ్య వివాహాలు జరిగాయి, అయితే ఈ లాక్ డౌన్ తో షూటింగులు లేకపోవడంతో సినిమా సెలబ్రెటీల వివాహాలు కొందరివి జరుగుతున్నాయి.

ఇటీవలే ప్రొడ్యూసర్ దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ ఆచంట మహేష్ పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు తాజాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ వివాహానికి సిద్దం అయ్యారు, తాజాగా దీనిపై వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ యంగ్ డైరెక్టర్ ప్రవల్లిక అనే అమ్మాయితో లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వారి ప్రేమకు పెద్దల అంగీకారం లభించడంతో ఇద్దరూ కలిసి ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యారు. దీనిపై ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.

ఇక ఈ నెల జూన్ 10న వీరి ఎంగేజ్ మెంట్ జరుగుతుంది అని తెలుస్తోంది, తర్వాత రెండు నెలల్లో వివాహం ఉంటుందట, ఇక సుజీత్ వివాహం చేసుకునే అమ్మాయి డాక్టర్ అని తెలుస్తోంది.
సుజీత్ రన్ రాజా రన్ తో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు, ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో సాహో మూవీ తెరకెక్కించారు. త్వరలో లూసీఫర్ కూడా ఆయనే తెరకెక్కించనున్నారు.