బేబీ బంప్ చూపించిన టాలీవుడ్ హీరోయిన్..

0
98

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మొదటి సినిమా అయినా ఏం పిల్లో ఏం పిల్లాడో మూవీతో మనకు పరిచయమయింది. ఆ తర్వాత అత్తారింటికి దారేది, రభస వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకొని..తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది.

ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ లో వరుస సినిమాలతో బిజీ అయిపొయింది ఈ అమ్మడు. కానీ ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. కరోనా సమయంలో పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుపెట్టింది. మూడు రోజుల క్రితమే తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రెగ్నెన్సీ టెస్టుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

తాజాగా సోషల్‌ మీడియా వేదికగా తన బేబీ బంప్‌ ఫోటోను మరొకటి షేర్‌ చేసింది. ”మహిళలు ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్‌ అయ్యాక ప్రతి సారి తమ పొట్టను ఇలా చూసుకుంటూ ఎంజాయ్‌ చేస్తుంటారు” అంటూ ఆ ఫోటోపై ట్యాగ్‌ లైన్‌ కూడా రాసుకొచ్చింది ప్రణీత. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ గా మారి పోయింది. దాంతో  ప్రణీతకు కంగ్రాట్స్‌ చెప్పుకొచ్చారు నెటిజన్స్.