దళిత బంధుపై మంత్రి హరీష్ రావు స్పష్టత..

0
40

దళితుల అభ్యున్నతి కోసం కేసిఆర్ సర్కార్ దళిత బంధు పథకాన్ని అమలు చేసింది. ఏ రంగాల్లో అయినా దళితులు కూడా ముందుడాలని అనేక వెసులుబాటులు కలిపిస్తున్నాం అని  మంత్రి హరీష్ రావు అన్నారు. సామాజిక వెనుకబాటు, ఆర్థిక ఇబ్బందులు దళిత కుటుంబాల్లో అధికంగా ఉంటాయని ఉద్దేశ్యంతో..అన్ని పథకాలు దళితుల నుంచి మొదలు పెట్టాం అని ఆర్థిక శాఖ మంత్రి  హరీష్ రావు అన్నారు.

వైన్ షాపుల్లో ఇప్పటికే దళితులకు రిజర్వేషన్లు ఇచ్చాం అని తెలిపారు. మెడికల్ షాపుల్లో, ప్రభుత్వ కాంట్రాక్ట్ లలో కూడా దళితులకు అవకాశం ఇచ్చేలా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఇలా అన్నింటిలో దళితులను పైకి తీసుకురావడానికి  సర్కార్ ప్రయత్నిస్తుందని మంత్రి అన్నారు. కేవలం ప్రభుత్వమే కాకుండా అందరు ప్రయత్నించాలని ఆయన తెలిపారు.

నాడు  దేశం సుభిక్షంగా ఉందంటే దానికి అంబేద్కర్ రాసిని రాజ్యాంగమే కారణం అని ఆయన జయంతి సందర్బంగా గుర్తుచేసుకున్నారు. కొంచెం ఆలస్యం కావొచ్చు కానీ ప్రతీ దళిత కుటుంబానికి కచ్చితంగా దళిత బంధు ఇస్తామని స్పష్టం చేశారు.  దళిత బంధు విషయంలో ఎటువంటి అనుమానాలు, అపోహలు అవసరం లేదన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం కూడా దళితుల నుంచే మొదలు పెట్టామని అన్నారు. ప్రతీ ఊరులో దళిత యువత కోసం లైబ్రరీలు ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్థిక సహాయంచేస్తుందని హరీష్ రావు అన్నారు.