టాలీవుడ్ లో ఇలీయానాకు బంపర్ ఆఫర్…

టాలీవుడ్ లో ఇలీయానాకు బంపర్ ఆఫర్...

0
33

ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో ఒక వెలుగు వెలిగిన ఇలియానాకు ఇప్పుడు అవకాశాలు తక్కువు అయ్యాయి… గతంలో దేవదాసు చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది… ఆతర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కూడా పలు చిత్రాల్లో నటించింది.. అయితే అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది… ఇక అదే సమయంలో తెలుగులో కూడా అవకాశాలు తక్కువ అయ్యాయి…

ఈ మధ్య కాలంలో ఈ చిన్నదానికి అవాకాశాలే కరువయ్యాయి… అయితే తాజాగా ఇలియానాకు ఒక ఆఫర్ వచ్చింది… అక్కినేని నాగార్జున సరసన నటించే అవకాశం దక్కించుకుంది… ప్రవీష్ సత్తార్ నాగ్ తో ఓ యాక్షన్ ప్రధాన చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు…

హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన రైడ్ చిత్రానికి ఇది రీమేక్ అంటున్నారు.. హిందీ వర్షన్ చాలా వరకు మార్పులు చేసి స్క్రిప్టు ను సిద్దం చేశారట… ఇక రైడ్ లో హీరోయిన్ గా నటించిన ఇలియానానే తెలుగులో కూడా తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నారట…