టాలీవుడ్ లో మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ ప్లాన్స్

టాలీవుడ్ లో మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ ప్లాన్స్

0
33

మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు టాలీవుడ్ లో బిగ్ సినిమాలు ప్లాన్ చేస్తోంది మొన్నటి వరకూ చిన్న సినిమాలు ప్లాన్ చేశారు… కాని ఇప్పుడు అన్నీ బిగ్ సినిమాలు ప్లాన్ చేశారు.. ఈ ఏడాది చాలా పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు.

రానున్న మూడేళ్లలో ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి అన్నీ పెద్ద సినిమాలే రాబోతున్నాయి. బన్నీ, పవన్, ప్రభాస్.. ఇలా అందరూ పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. తాజాగా బన్నీ సుకుమార్ సినిమా మైత్రీ మూవీస్ చేస్తోంది. ఇక పవన్ కల్యాణ్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా కూడా మైత్రీ మూవీ మేకర్స్ చేస్తోంది.

తర్వాత ప్రభాస్-కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తోంది., ఇక తర్వాత ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ తో చర్చలు జరుపుతున్నారు, రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లపై కూడా చర్చలు జరుగుతున్నాయి. సో వచ్చే రెండు మూడు సంవత్సరాలు అన్నీ మైత్రీ వారి సినిమాలే రానున్నాయి.