తెలుగులో రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్లు వీరే

తెలుగులో రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్లు వీరే

0
43

సినిమా పరిశ్రమలో అవకాశాలు రావడం చాలా కష్టం ..టాప్ హీరోయిన్లు స్టార్ హీరోలు అయినా అవకాశం వచ్చిన తర్వాత మళ్లీ అవకాశాలు రాక ఇబ్బంది పడిని వారు ఉన్నారు, ఇక హీరోయిన్ ల విషయానికి వస్తే ఒక సినిమా హిట్ అయితే మళ్లీ ఆ సినిమా తర్వాత మరో సినిమా ఛాన్స్ రాకపోతే కష్టమే.. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టాలి అని వచ్చిన ఏ అవకాశాలని వదులుకోరు ముద్దు గుమ్మలు.

ఇక తండ్రితో కూమారుడితో కూడా నటించి మెప్పించిన ముద్దు గుమ్మలు టాలీవుడ్ లో ఉన్నారు, మరి రెండు తరాలు ఆడిపాడి అద్బుతమైన నటనతో పేరు తెచ్చుకున్న నటీమణులెవరు అనేది ఇప్పుడు చూద్దాం.

1..కాజల్ అగర్వాల్ ..మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెం 150,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్,రాంచరణ్ తో మగధీర,అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది మెగా ఫ్యామిలీ మొత్తంతో నటించిన టాప్ హీరోయిన్ ఈమె అని చెప్పాలి.

2. తమన్న భాటియా. ఈ అందాల భామ చిరంజీవితో సైరా సినిమాలో నటించింది, ఇక రామ్ చరణ్ తో
రచ్చ, పవన్ తో కెమెరా మెన్ గంగతో రాంబాబు, బన్నీతో బద్రీనాద్ లో చేసింది

3..ఆర్తి అగర్వాల్ ఎన్టీయార్ తో అల్లరి రాముడు, బాలక్రిష్ణ తో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో నటించింది.

4.. త్రిష.నందమూరి కుటుంబానికి చెందిన రెండు తరాల నటులు బాలక్రిష్ణ,ఎన్టీయార్ తో సినిమాలు చేసింది

5..నయనతార
ఇటు బాలయ్యతో ఎన్టీఆర్ తో నటించింది
ఇక వెంకటేష్ రానాతో కూడా ఆమె నటించింది.
లక్ష్మీ-తులసి,బాబు బంగారంలో నటించారు.. ఇక రానాతో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రం చేసింది.

6..సమంత
సమంతా అక్కినేని అల్లు అర్జున్ తో సన్ ఆఫ్ సత్యమూర్తి అలాగే రామ్ చరణ్ తో రంగస్ధలం, పవన్ కల్యాణ్ తో అత్తారింటికి దారేది నటించింది.

7..శ్రీయ బాలక్రిష్ణతో చెన్నకేశవరెడ్డిలో నటించిన శ్రీయ ..ఎన్టీయార్ తో నా అల్లుడు సినిమాలో నటించింది ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు రెండు తరాల వారితో నటించారు.