టాలీవుడ్ దర్శకుడు బాబీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి కొల్లి మోహనరావు(69) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో ఆయన మృతి పట్ల పలుపురు సినీప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా బాబీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇంతలో ఇలా జరగడంతో చిరు సినిమా షూటింగ్ కు బ్రేక్ పడనుంది.