సుడిగాలి సుధీర్ బుల్లితెర మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు, ఇక జబర్ధస్త్ నుంచి పలు సినిమాల్లో నటించాడు… అంతేకాదు ఇప్పుడు హీరోగా కూడా నటించారు, వరుస సినిమాలు బుల్లితెర షోలతో చాలా బిజీ బిజీగా ఉన్నాడు మన సుధీర్… ఇక సుధీర్ తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
చిత్ర సీమలో బుల్లితెరలో ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్, ముందు వేణువండర్స్ టీమ్ లో సభ్యుడిగా జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత ఓ టీమ్ లీడర్ గా నిలబడ్డాడు.. స్కిట్లు, కామెడీతో పాటు డ్యాన్స్లు చేస్తూ, పాటలు పాడుతూ బుల్లితెర ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నారు.
మన దేశంలో బుల్లితెరపై ఉత్తమ నటులను, ప్రభావితం చేసే క్యారెక్టర్లను, ఎంటర్టైనర్లను ఎంపిక చేసే ఆర్మాక్స్ మీడియా 2021 జనవరి నెలలో జాబితా విడుదల చేసింది…ఇందులో ఆయన ఉత్తమ ఎంటర్టైనర్ విభాగంలో మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నాడు… దీంతో సుధీర్ అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు.. మొదటిది ఢీ షో రెండో స్థానం జబర్ధస్త్ లో ఈ అవార్డు వచ్చింది. సుధీర్ ఆర్మాక్స్ మీడియా 2020 అవార్డును కూడా గత ఏడాది గెలుచుకున్న విషయం తెలిసిందే.
ReplyForward
|