సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలోనే మరణించారు. అతని మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.