Flash: కిన్నెర మోగిలయ్య కుటుంబంలో విషాదం …

0
100

నల్లమల ముద్దుబిడ్డ, కిన్నెర వాయిద్య కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మొగిలయ్య  కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మొగులయ్య రెండో కూతురు రాములమ్మ బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుండగా రాత్రి ఇంటి ఎదురుగా ఉన్న బీటీ రోడ్డుపై జారి పడింది.

ఆ క్రమంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో వారి ఊరికి సమీపంలో ఉన్న లింగాల ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు హుటాహుటిగా తరలించగా..పరిస్థితి విషమంగా ఉండటంతో వేరే ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలనీ వైద్యులు చెప్పడంతో తీసుకెళ్లారు. కానీ అంతలోనే ఆమె మరణించినట్టు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు చేసుకున్నారు.

దాంతో మరణవార్త తెలిసిన కొందరు వ్యక్తులు మొగులయ్యతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఆమెకు వివాహం జరిగిన నాలుగేళ్ల తర్వాత భర్త మృతిచెందడంతో రాములమ్మ తండ్రి దగ్గరే ఉంటోంది. మొగులయ్య భార్య శంకరమ్మ, బిడ్డ రాములమ్మ ఇక లేకపోవడంతో రోదనకు గురయ్యాడు.