మెగా ఫ్యాన్స్ కు ట్రిపుల్ బొనాంజ..ఒకే సినిమాలో చిరంజీవి, వెంకటేష్, రవితేజ

0
117
Ram charan upasana

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఆచార్య ఇచ్చిన గుణపాఠంతో కథల ఎంపికలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య సినిమాను బాబీ తెరకెక్కిస్తుండగా..శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా మాస్ కథాంశంతో తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాకు మ్యుజిక్ సెన్సేషన్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో ప్రత్యేక రోల్ లో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. మల్టీస్టారర్ సినిమాలకు కేరాఫ్ గా మారిన విక్టరీ వెంకటేష్ వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ తో కలిసి నటించబోతున్నట్లు సమాచారం. ఒకే సినిమాలో ముగ్గురు స్టార్స్ నటిస్తున్నారన్న వార్త తెలిసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవు.