త్రివిక్రమ్ అల్లు అర్జున్ మరో సినిమా ఎప్పుడంటే

త్రివిక్రమ్ అల్లు అర్జున్ మరో సినిమా ఎప్పుడంటే

0
65

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చింది అల వైకుంఠపురంలో… ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అల్లు అర్జున్ కి కెరియర్ లోనే అతి పెద్ద హిట్ గా చెప్పవచ్చు…. సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది.

ఇక త్రివిక్రమ్ బన్నీ ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన జులాయి .. సన్నాఫ్ సత్యమూర్తి విజయాన్ని సాధించగా, అల వైకుంఠపురములో సినిమాతో హ్యాట్రిక్ హిట్ దక్కింది… ఇక మరో సినిమా కూడా వీరు చేయనున్నారు అని .తెలుస్తోంది.

బన్నీతో సినిమా చేయాలని అల్లు అరవింద్ కోరారట, అల వైకుంఠపురం సీక్వెల్ లేదా వేరే కొత్త కథని బన్నీకి రెడీ చేయమని చెప్పారట.. ఇక తారక్ తో సినిమా తర్వాత త్రివిక్రమ్ మళ్లీ బన్నీతో సినిమా చేసే అవకాశం ఉంది అని టాక్ అయితే వినిపిస్తోంది… మరి వీరిద్దరి కాంబినేషన్ కుదరాలి అంటే మరో రెండు సంవత్సరాలు పట్టవచ్చు.