త్రివిక్రమ్-మహేష్ బాబు మూవీ రిలీజ్ డేట్ లాక్..అధికారిక ప్రకటన వచ్చేసింది!

0
111

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్, ప్రభాస్ తరువాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మహేష్‌ బాబు. సూపర్ స్టార్ ఇటీవల “సర్కారు వారి పాట” సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

ఇక ఈ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల వంటి స్టార్స్ తో పని చేయాల్సి ఉంది. ఇక తాజాగా త్రివిక్రమ్ సినిమా నుండి అ కొత్త స్టిల్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చారు మ‌హేశ్​ బాబు.అలాగే ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్.

వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మాసివ్, ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.