పవన్ కల్యాణ్ సినిమా నుంచి త్రివిక్రమ్ అవుట్

పవన్ కల్యాణ్ సినిమా నుంచి త్రివిక్రమ్ అవుట్

0
78

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమా చేస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.. నవంబర్ 15 న అనౌన్స్ మెంట్ ఉంటుంది అని వార్తలు వచ్చాయి.. కాని 10 రోజులు దాటింది అలాంటి ప్రకటన లేదు. చాలా మంది దర్శకుల పేర్లు కూడా ఈ సినిమా చేస్తున్నారు అని వార్తలు వచ్చినా, అన్నీ పుకార్లు అయ్యాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది.

ఈ సినిమా నుంచి డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్-నిర్మాణ సంస్థ హారిక హాసిని పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు వల్లే వారు వెనక్కి వెళ్లారు అంటున్నారు, వేణు శ్రీరామ్ చేత స్క్రిప్ట్ రాయించుకోవాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారట. అందుకే వీరు వెనక్కి వెళ్లారట.

మరి ఈ సినిమా పవన్ చేస్తారా లేదా చూడాలి, ఎందుకు అంటే త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టులో ఉన్నారు కాబట్టి ఆయన ఒప్పుకున్నారు అని తెలుస్తోంది, మరిచూడాలి ఈ చిత్రం దిల్ రాజు చేస్తారా లేదా మరెవరికైనా అప్పగిస్తారా అనేది.