ప్రిన్స్ సినిమా కోసం స్పీడు పెంచిన త్రివిక్రమ్

Trivikram speeds up for Prince Mahesh Babu movie

0
130

మాటల మాంత్రికుడు – దర్శకుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్దంగా ఉన్నారు. ఇప్పుడు సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నారు మహేష్. అయితే త్రివిక్రమ్ సినిమా ఈ దసరాకి పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాకి సంబంధించి ప్రి పొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేశారు.

సంగీత దర్శకుడిగా తమన్ ను తీసుకున్నారు. ఒకటి రెండు రోజులలో మ్యూజిక్ సిటింగ్స్ మొదలుపెడతారట. ఇక ఈ సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. ఇక తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇందులో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉందట.

సెప్టెంబర్ నాటికి అన్ని పనులను పూర్తిచేసుకుని, దసరా సందర్భంగా షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.ఇక గతంలో వీరి కాంబోలో వచ్చిన సినిమాల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. అతడు,ఖలేజా సినిమాలు అభిమానులకు అలా గుర్తు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. చూడాలి ఇందులో మహేష్ ని త్రివిక్రమ్ ఎలా చూపిస్తారో.