ట్రూ మూవీ హిట్టా..ఫట్టా…రివ్యూ…!!

-

శ్యామ్ మండల. దర్శకత్వంలో గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ కేఆర్ గారు నిర్మించిన మూవీ ‘ట్రూ”.. బైలాంపుడి సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయమైనా హీరో హరీష్ వినయ్ హీరోగా లావణ్య హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా అప్ డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. మంచి స్పందన కూడా వచ్చింది.. ఈనేపథ్యలో ఈరోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం..

- Advertisement -

కథ :

హీరో విగ్నేష్ ఓ ప్రముఖ ఛానల్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పని చేస్తూ ఉంటాడు.. తన తండ్రి మధుసూదన్ మరణం కారణంగా సొంతూరుకు వెళ్ళిన విగ్నేష్ అక్కడ తన తండ్రి కరెంట్ షాక్ తో చనిపోతాడు అని తెలుసుకుంటాడు.. ఆ ఊరికి ప్రెసిడెంట్ అయిన మధుసూదన్ ఇలా అర్ధాంతరంగా చనిపోవడం ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు విగ్నేష్.. ఈ గ్రామంలో ఆయనకు కొన్ని భయంకర నిజాలు తెలుస్తాయి.. అసలు మధుసూదన్ చనిపోవడానికి కారణం ఏంటి.. ఎవరు చంపేస్తే ఆయన చనిపోయారు.. అన్న విషయాలకు నిజాలు తెలుసుకుంటాడు.. అది ఎలా తెలుసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ..

నటీనటులు :

హరీష్ వినయ్ హీరోగా విఘ్నేష్ పాత్రలో చాలా బాగా నటించాడు. తండ్రి చావుకు కారణం తెలుసుకునే కొడుకుగా, తన తండ్రి చనిపోయాడన్న బాధ లాంటి ఎమోషన్స్ చాలా చక్కగా చూపించాడు.యాక్షన్ సన్నివేశాల విషయంలో లవ్ ఎమోషన్స్ లో బాగా నటించాడు. హీరోయిన్ లావణ్య తనదైన అందంతో ఆకట్టుకుంది. అందానికి అందం, నటన విషయంలో చక్కగా పర్ఫార్మెన్క్ ఇచ్చింది. ఊరి ప్రసిడెంట్ గా మధసూధన్ పాత్ర హైలెట్ గా సాగింది. అతని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగితా పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు..

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు సినిమాని ఎంతో చక్కగా తెరకెక్కించాడు. కథ కథనం బలంగా ఉండడంతో ఈ సినిమా హిట్ గా నిలిచింది.. తొలి సినిమానే అయినా సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫీ. కెమెరా అందించిన శివారెడ్డి ప్రతి ఫ్రేమ్ కూడా చక్కగా ఉంది. పల్లె అందాలు, ఎమోషన్ ని కాప్చర్ చేసే సన్నివేశాల్లో ఫోటోగ్రఫి బాగుంది. ఆ తరువాత మరో ప్రధాన హైలెట్ ఆర్ ఆర్. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఆర్ ఆర్ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొన్ని సాన్నివేశాలల్లో ఆర్ ఆర్ కొంత మైనస్ అయింది, తప్ప మిగతా సన్నివేశాల్లో ఆర్ ఆర్ బాగుంది. ఇక ఎడిటింగ్ .. కథను చాలా చక్కగా ఎక్కడ బోర్ కొట్టకుండా ఎడిటర్ తన పనితనం చక్కగా చేసాడు. నిర్మాణ విలువలు చాలాబాగా ఉన్నాయి.. మ్యూజిక్ అదిరిపోయింది..

ప్లస్ పాయింట్స్ :

దర్శకత్వం

పాత్రల ఎంపిక

మ్యూజిక్

చివరిగా : నిజంగా ఈ ‘ట్రూ’ అనే సినిమా ఒక మంచి ప్రయత్నం… కథను చాలా ట్విస్టుట్లతో ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు కథ, కథనాలను అల్లుకున్నాడు.తప్పకుండా ఇది అందరు చూడాల్సిన సినిమా..

రేటింగ్ : 3.75/5

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...