ఫ్యాన్స్ కు పండగ..ఒకే స్టేజ్ పై ఇద్దరు స్టార్ హీరోలు

0
107

ఎంతో మంది హీరోలను టాలీవుడ్‌కు పరిచయం చేసిన టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. సరిగ్గా 24 ఏళ్ల కిందట సందడి లాంటి సినిమా ‘పెళ్లి సందడి’ ని చూపించారు. ఇప్పుడు రాఘవేంద్రుడు  పెళ్లి సంద‌డి చిత్రంతో న‌టుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఇందులో వశిష్ట అనే పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు. ‘పెళ్లి సందD’ పేరుతో రోషన్‌, శ్రీలీల జంటగా చిత్రం రూపొందుతుండ‌గా, ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. తనికెళ్ల భరణి, రావు రమేశ్‌, హేమ, ఝాన్సీ తదితరలు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రంకు సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు. కొద్ది రోజుల క్రితం మ‌హేష్ చేతుల మీదుగా ట్రైల‌ర్ విడుద‌ల చేయించిన మేక‌ర్స్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్‌ల‌ని చీఫ్ గెస్ట్‌లుగా ఆహ్వానిస్తున్నారు. ఈ వేడుక అక్టోబ‌ర్ 10 సాయంత్రం 6 గం.ల నుండి మొద‌లు కానుంది.

కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్ కలగలిపి పక్కా ఫామిలీ ఎంటర్టైనర్ గా పెళ్లి సందడి తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. 24 ఏళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడిలో శ్రీకాంత్ హీరోగా నటించాడు. కాగా తాజాగా తెరకెక్కిన పెళ్లి సందD లో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించడం విశేషం. నిర్మలా కాన్వెంట్ స్కూల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రోషన్ కు ఇది రెండో సినిమా.